Hyderabad: కోఠి డీఎంఈ ఆఫీస్ ముందు డాక్టర్ల భారీ ధర్నా.. జీవో 38 అమలు చేయాలని డిమాండ్!
Hyderabad: జీవో 38 ప్రకారం ప్రభుత్వ వైద్యుల బదిలీలను ఆఫ్ లైన్ లో చేపట్టాలని డిమాండ్ చేస్తూ కోఠిలోని డీఎంఈ కార్యాలయం ముందు వైద్యుల సంఘం ధర్నా నిర్వహించింది.
Hyderabad: కోఠి డీఎంఈ ఆఫీస్ ముందు డాక్టర్ల భారీ ధర్నా.. జీవో 38 అమలు చేయాలని డిమాండ్!
Hyderabad: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 38 ప్రకారం బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కోఠిలోని వైద్య విద్య సంచాలకుల కార్యాలయం ముందు ప్రభుత్వ వైద్యుల సంఘం ధర్నా చేపట్టింది. జీవో విడుదలై నెలరోజులు గడుస్తూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసోసియేషన్ అధ్యక్ష , కార్యదర్శులు డాక్టర్ నరహరి , డాక్టర్ లాలూ ప్రసాద్ లు ఆరోపించారు. బదిలీలపై తమకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదంటూ హెచ్.ఓ.డిలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 38 ప్రకారం , ఆఫ్ లైన్ లో బదిలీలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ వైద్యుల సంఘం 2010 లో ఏర్పాటైందని , తెలంగాణ ఉద్యమంలో తాము కీలకంగా వ్యవహరించమని తెలిపారు. బదిలీలలో తమ సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.




