Hyderabad: సెప్టెంబర్ 13న గ్లోబల్ అద్వైత మిషన్ 'జ్ఞానోదయ ఉద్యమం'!

Hyderabad: ఆధ్యాత్మిక జ్ఞానాన్నిపెంచేందుకు గ్లోబల్ అద్వైత మిషన్ సెప్టెంబర్ 13న 'జ్ఞానోదయ ఉద్యమం'. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది.

RAJESH,	WEST ZONE
Published on: 11 Aug 2026 11:49 AM IST
Hyderabad
X

Hyderabad: సెప్టెంబర్ 13న గ్లోబల్ అద్వైత మిషన్ 'జ్ఞానోదయ ఉద్యమం'!

Hyderabad: యువతలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సులువైన పద్ధతిలో అందించేందుకు గ్లోబల్ అద్వైత మిషన్ ఆధ్వర్యంలో జ్ఞానోదయ ఉద్యమ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 13న ప్రారంభించనున్నట్లు మిషన్ తెలిపింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కార్యక్రమ బ్రోచర్ ను మిషన్ చైర్మన్ చలసాని బాలరామయ్య, ఫౌండర్ డైరెక్టర్ ఆనంద్ కె రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిల్పకళా వేదికలో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అన్ని పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

మానవాళి అభ్యున్నతికి ఆధ్యాత్మిక జ్ఞానం ఎంతో ముఖ్యమని ఈ నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమంలో రూపొందించిన 76 పాటలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story