Ghatkesar: హైదరాబాద్-వరంగల్ హైవేపై గుంతలు పూడ్చిన పోలీసులు!

Ghatkesar: నారపల్లి వద్ద జాతీయ రహదారిపై భారీ గుంతలను డాంబర్‌తో పూడ్చించిన ఘట్‌కేసర్ ట్రాఫిక్ పోలీసులు. తక్షణ చర్యలపై వాహనదారుల అభినందనలు.

KARUNAKAR, UPPAL
Published on: 2 Aug 2026 2:50 PM IST
Ghatkesar
X

Ghatkesar: హైదరాబాద్-వరంగల్ హైవేపై గుంతలు పూడ్చిన పోలీసులు!

ఘట్‌కేసర్: వర్షాల కారణంగా మల్కాజిగిరి నగరపాలక సంస్థ ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ నారపల్లి యూ-టర్న్ వద్ద హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రమాదాల ముప్పు పెరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఘట్‌కేసర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వై. రవీందర్, ఎస్‌ఐ సోమయ్య సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

అనంతరం రహదారి కాంట్రాక్టర్ నరేందర్‌తో డాంబర్ వేయించి గుంతలను తక్షణమే పూడ్చివేయించారు. మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి వాహనాల రాకపోకలను సజావుగా నిర్వహించారు. ప్రజల సమస్యపై వెంటనే స్పందించి ప్రమాదకరంగా మారిన రహదారిని ప్రయాణానికి అనువుగా మార్చిన ఘట్‌కేసర్ ట్రాఫిక్ పోలీసుల తక్షణ చర్యను స్థానికులు, వాహనదారులు అభినందించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story