Ghatkesar: 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం డ్రైవర్ అరెస్ట్
Ghatkesar: ఘట్‌కేసర్ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.
Ghatkesar: 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం డ్రైవర్ అరెస్ట్
ఘట్‌కేసర్: రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తుండగా ఘట్‌కేసర్ పోలీసులు పట్టుకున్నారు. ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నంబర్ 9 వద్ద తనిఖీలు నిర్వహించి 25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బియ్యాన్ని తరలిస్తున్న ట్రక్కు డ్రైవర్ ధెరవత్ శ్రీను (40)ను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టగా టీజీ30టీ5841 నంబర్ గల సుప్రో ప్రాఫిట్ ట్రక్కులో బియ్యం గుర్తించారు. విచారణలో రేషన్ కార్డుదారుల నుంచి కిలోకు రూ.16 చొప్పున బియ్యాన్ని కొనుగోలు చేసి, మరో వ్యక్తికి కిలోకు రూ.20 చొప్పున విక్రయిస్తున్నట్లు శ్రీను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా దారి మళ్లించి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో శ్రీకాంత్ (శంషాబాద్) అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. శ్రీను నుంచి 25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంతో పాటు ట్రక్కు, మొబైల్‌ఫోన్, రూ.7 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.




