Ghatkesar: ఘట్‌కేసర్ ఓఆర్‌ఆర్ వంతెన బీమ్‌లు ధ్వంసం ప్రజల ఆందోళన!
Ghatkesar: ఘట్‌కేసర్ ఓఆర్‌ఆర్ హైదరాబాద్-వరంగల్ రహదారి వంతెన బీమ్‌లు ధ్వంసం. కాంక్రీట్ ఊడి ఇనుప సువ్వలు బయటకు రావడంతో ప్రయాణికుల ఆందోళన, అధికారుల తనిఖీకి డిమాండ్.
Ghatkesar: ఘట్‌కేసర్ ఓఆర్‌ఆర్ వంతెన బీమ్‌లు ధ్వంసం ప్రజల ఆందోళన!
Ghatkesar: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) పరిధిలోని హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న ఓ వంతెన బీమ్‌లు దెబ్బతిన్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. బీమ్ ల కింది భాగంలోని కాంక్రీట్ కొంత ఊడిపోవడంతో ఇనుప సువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. దీంతో వంతెన భద్రతపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బీమ్‌లు దెబ్బతినడానికి నిర్మాణ సమయంలో చోటుచేసుకున్న నాణ్యత లోపం కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే బీమ్‌లు దెబ్బతినడానికి అసలు కారణమేంటన్నది అధికారుల పరిశీలనలో తేలాల్సి ఉంది.
పర్యవేక్షణ ఏదీ?
వంతెన బీమ్‌ల పరిస్థితి ఇలా మారుతున్నా సంబంధిత సిబ్బంది గుర్తించకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓఆర్‌ఆర్ పరిధిలో రహదారులు, వంతెనల పర్యవేక్షణకు సిబ్బంది ఉన్నప్పటికీ బీమ్ దెబ్బతిన్న విషయం వారి దృష్టికి రాకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ నాణ్యతపై అనుమానాలతో పాటు నిర్వహణ, పర్యవేక్షణ తీరుపైనా చర్చ జరుగుతోంది.
బీమ్‌ల కింది భాగంలో కాంక్రీట్ ఊడి ఇనుప సువ్వలు బయటకు కనిపిస్తున్న నేపథ్యంలో అధికారులు తక్షణమే వంతెనను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. బీమ్‌ల పటిష్ఠతను తనిఖీ చేసి, దెబ్బతినడానికి గల కారణాన్ని నిర్ధారించాలని, అవసరమైతే వెంటనే మరమ్మతులు చేపట్టి వాహనదారుల భద్రతకు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.




