Serilingampally: అంజన్న సన్నిధిలో టీపీసీసీ నేత జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక పూజలు

Serilingampally: శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు వి. జగదీశ్వర్ గౌడ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 12 May 2026 2:49 PM IST
Serilingampally
X

Serilingampally: అంజన్న సన్నిధిలో టీపీసీసీ నేత జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక పూజలు

శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ “హనుమాన్ జయంతి శుభాకాంక్షలు! శ్రీ హనుమంతుడు మీకు బలం,ధైర్యం,విజయాన్ని ప్రసాదించాలని .” టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మాతృశ్రీ నగర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ మరియు ఇజ్జత నగర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత నగర్ శ్రీ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ హనుమంతుడు భగవంతునిపై అచంచలమైన భక్తి ఎలా ఉండాలో ప్రపంచానికి చూపించారని,శ్రీరాముడి సేవనే జీవిత లక్ష్యంగా భావించి నిస్వార్థంగా పనిచేశారని.అందుకే ఆయనను “భక్త శిరోమణి” అని పిలుస్తారని అన్నారు. ఈ పూజ కార్యక్రమంలో స్థానిక నాయకులు సయ్యద్ గౌస్,ఏకే బాలరాజ్,సాంబశివరావు,జంగయ్య యాదవ్,గంగల శ్రీనివాస్ యాదవ్,గంగల గణేష్ యాదవ్,వెంకటేష్ సాగర్,మహేష్,వెంకట్ రెడ్డి,ముక్తార్,ఇస్మాయిల్,లతీఫ్,శశిరేఖ,శ్రీజ రెడ్డి,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story