Abdullapurmet: సాయి నగర్ టౌన్‌షిప్‌లో ఘనంగా వినాయక మండపం ప్రారంభం
Abdullapurmet: అబ్దుల్లాపూర్మెట్ మండలం పిగ్లిపూర్ సాయి నగర్ టౌన్‌షిప్‌లో సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డి కుటుంబ నిధులతో నిర్మించిన వినాయక మండపాన్ని ప్రారంభించారు.
Abdullapurmet: సాయి నగర్ టౌన్‌షిప్‌లో ఘనంగా వినాయక మండపం ప్రారంభం
అబ్దుల్లాపూర్మెట్: పిగ్లిపూర్ గ్రామంలోని సాయి నగర్ టౌన్‌షిప్‌లో వినాయక మండపాన్ని ఘనంగా ప్రారంభించారు. పిగ్లిపూర్ సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డి తల్లి కోట నిర్మలమ్మ జ్ఞాపకార్థం, వారి కుటుంబ సభ్యులు కోట రామిరెడ్డి, సుజాత–ప్రభాకర్ రెడ్డి, నికిత–రితీష్ రెడ్డి, సాయి తేజ రెడ్డి కుటుంబ సభ్యుల సొంత నిధులతో వినాయక మండపాన్ని నిర్మించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ దుర్గం నరసింహ యాదవ్, వార్డు సభ్యులు జక్కుల శివకుమార్, జక్కుల ఝాన్సీ–ఆంజనేయులు, వర్ధన్ లావణ్య–హనుమంతు, జక్కుల పరమేష్, పంది మురళీకృష్ణ, కొండ రమేష్, కొలను హరిణి–మహేందర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, వెంకట్ రెడ్డితో పాటు పిగ్లిపూర్ గ్రామ పెద్దలు, గ్రామస్తులు, చిన్నారులు, సాయి నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.
వినాయక చవితి సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.




