Hyderabad: ఉషా ముళ్ళపూడి రోడ్డులో రోడ్డు ఆక్రమణలపై ఉక్కుపాదం

Hyderabad: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాలతో గాజులరామారంలో ముమ్మరంగా ఆక్రమణల తొలగింపు డ్రైవ్ జరిగింది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 23 May 2026 8:23 PM IST
Hyderabad
X

Hyderabad: ఉషా ముళ్ళపూడి రోడ్డులో రోడ్డు ఆక్రమణలపై ఉక్కుపాదం

Hyderabad: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు గాజులరామారం సర్కిల్ డెప్యూటీ కమిషనర్ యు. వెంకట్రాములు పర్యవేక్షణలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది భారీ ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌ను చేపట్టారు.

ఉషా ముళ్ళపూడి హాస్పిటల్ రోడ్డు నుండి రామ్‌కీ అపార్ట్‌మెంట్స్ వరకు రహదారికి ఇరువైపులా ఉన్న అనధికారిక షాపులు, తోపుడు బండ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను సిబ్బంది జేసీబీల సహాయంతో తొలగించారు. ఈ మార్గంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతుండటం, కాలినడకన వెళ్లే ప్రజలు ప్రమాదాల బారిన పడుతుండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా డెప్యూటీ కమిషనర్ యు. వెంకట్రాములు మాట్లాడుతూ.. రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని తెలిపారు. మరోసారి ఎవరైనా రోడ్లపైకి వస్తే సామాగ్రిని జప్తు చేయడమే కాకుండా, సదరు వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు నమోదు చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. వ్యాపారులు మున్సిపల్ నిబంధనలను పాటించి, నగర రవాణా వ్యవస్థ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన కోరారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story