Gachibowli: అంజయ్య నగర్ డివిజన్‌లో వీధి దీపాల సమస్యపై డీసీకి వినతి!
Gachibowli: గచ్చిబౌలి అంజయ్య నగర్ డివిజన్‌లో వీధి దీపాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ నాయకులు ఆంజనేయులు సాగర్ డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణను కలిశారు.
Gachibowli: అంజయ్య నగర్ డివిజన్‌లో వీధి దీపాల సమస్యపై డీసీకి వినతి!
Gachibowli: గచ్చిబౌలి అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్, సిద్ధిక్ నగర్, రాజీవ్ నగర్, గుల్షన్ నగర్ కాలనీలలో వీధి దీపాల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అంజయ్య నగర్
డివిజన్ నాయకులు ఆంజనేయులు సాగర్ మరోసారి డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణను కలిసి వినతి చేసారు. గత వారం ఇదే సమస్యపై డీసీ బాలకృష్ణను కలిసి వినతిపత్రం సమర్పించినప్పటికీ, ఇంకా వీధి దీపాలు ఏర్పాటు కాకపోవడంతో
ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంజనేయులు సాగర్ తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో చీకటి కారణంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల ప్రాంతంలో అంజయ్య నగర్ కాలనీలో ఒక హత్య ఘటన కూడా చోటుచేసుకోవడంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొందని, ఇలాంటి పరిస్థితుల్లో వీధి దీపాలు లేకపోవడం ప్రజల భద్రతకు ఆందోళనకరంగా మారిందని ఆయన డీసీ గారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని వీధి దీపాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని, సంబంధిత అధికారులను వెంటనే ఆదేశించాలని కోరారు.
ఈ సందర్భంగా డీసీ బాలకృష్ణ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులను వెంటనే ఆదేశించి అవసరమైన ప్రాంతాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అంజయ్య నగర్ కాలనీ అధ్యక్షులు నరసింహ సాగర్, నాయకులు పి. లక్ష్మయ్య, రవీందర్, కృష్ణ సాగర్, డి తిరుపతయ్య సాగర్, తదితరులు పాల్గొన్నారు.




