Hyderabad: వాజ్‌పేయి వర్ధంతి.. ఘనంగా నివాళులర్పించిన రాజ్యలక్ష్మి!

Hyderabad: అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా మల్కాజిగిరి వినాయక్‌నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 16 Aug 2026 7:58 PM IST
Hyderabad
X

Hyderabad: వాజ్‌పేయి వర్ధంతి.. ఘనంగా నివాళులర్పించిన రాజ్యలక్ష్మి!

Hyderabad: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా వినాయక్‌నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి వాజ్‌పేయి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా క్యానం రాజ్యలక్ష్మి మాట్లాడుతూశదేశానికి అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

దేశభక్తి, ప్రజాసేవ,విలువలతో కూడిన రాజకీయాలకు వాజ్‌పేయి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఓం ప్రకాష్, సాయి సురేష్ తదితరులు పాల్గొని వాజ్‌పేయికి నివాళులర్పించారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story