Malkajgiri: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఎల్ఏల అవగాహన సదస్సు సక్సెస్!

Malkajgiri: బీఎల్ఏల అవగాహన సదస్సులో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొని, 100% ఎస్ఆర్ఐ ఓటర్ల నమోదు పూర్తి చేసిన వారికి బహుమతులు పంపిణీ చేశారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 28 July 2026 4:55 PM IST
Malkajgiri
X

Malkajgiri: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఎల్ఏల అవగాహన సదస్సు సక్సెస్!

మల్కాజ్గిరి: ఎస్ ఆర్ ఐ నమోదు కార్యక్రమంలో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకునికి గుర్తింపు ఉంటుందని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు.మల్కాజిగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాజిగిరిలో బిఎల్ఎ లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీ నాయకులు,అబ్జర్వర్ సమీర్ కౌశల్ లు హాజరయ్యారు.ఇప్పటికీ 100 శాతం ఎస్ ఆర్ ఐ నమోదు పూర్తి చేసిన వారికి మైనంపల్లి చేతుల మీదుగా బహుమతులను అందజేసి శాలువతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను నాయకుడిని కాపాడుకుంటానని కష్టపడి పనిచేసిన వారికి మంచి ప్రోత్సాహాన్ని అందిస్తామని వెనుకబడిన ప్రతి బి ఎల్ ఏ ఇప్పటికైనా ముందుండి పని చేయాలని సూచించారు.

అబ్జర్వర్ మాట్లాడుతూ ఏ నియోజకవర్గంలో లేనివిధంగా మల్కాజిగిరి నియోజకవర్గం లో మైనంపల్లి హనుమంతరావు పతి బిఎల్ ఎ కు ప్రోత్సాహాన్ని అందిస్తూ అందర్నీ సమానంగా చూడాలని వారు కష్టపడి పని చేస్తారని చెబుతున్నారని ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ కాకుండా ఇకముందు కష్టపడే వారిని ప్రత్యేక గుర్తింపు ఇస్తామని వారు చెప్పడం మైనంపల్లి మనసు గొప్పదని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లు ప్రేమ్ కుమార్,జితేంద్ర నాథ్, మల్కాజిగిరి ఇంచార్జీ లక్ష్మీ కాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్ర శేఖర్,బి బ్లాక్ అద్యక్షుడు వెంకటేష్ యాదవ్,బి కే శ్రీనివాస్,సతీష్ కుమార్, పిట్టల శ్రీనివాస్,డివిజన్ అధ్యక్షులు,జీడి సంపత్ గౌడ్ వైనాల ప్రవీణ్ కుమార్,వినోద్ యాదవ్, సత్యమూర్తి యూసుఫ్ భాయ్ పిట్టల నాగరాజు, శ్రీకాంత్,లక్మి,రాందాస్ సంతోష్ ముదిరాజ్, రామచందర్,పార్థ సారథి,వెంకన్న, శ్రీరామ్ యాదవ్,సురేష్ సింగ్, అశోక్ రెడ్డి,నవీన్,ఆశా, సుమలత యాదవ్,పుష్పలత, ఇందిర ప్రియదర్శిని, శారద,రోజా రమణి, కనకలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story