LB Nagar: ఎల్.బి. నగర్ జోన్ అభివృద్ధిపై మాజీ కార్పొరేటర్ చర్చలు
LB Nagar: ఎల్.బి. నగర్ నూతన జోనల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వికాస్ మహాతోను హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
LB Nagar: ఎల్.బి. నగర్ జోన్ అభివృద్ధిపై మాజీ కార్పొరేటర్ చర్చలు
LB Nagar: నూతన ఎల్.బి. నగర్ జోనల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ వికాస్ మహాతో గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి గారు!
ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేస్తూ, ఎల్.బి. నగర్ జోన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
హయత్‌నగర్ డివిజన్ సహా పరిసర ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, రోడ్లు, వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. ఈ సమావేశం సానుకూల వాతావరణంలో కొనసాగగా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరస్పర సహకారంతో ముందుకు సాగాలని మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి గారు పేర్కొన్నారు, కార్పొరేటర్ గారితో పాటు బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవింద చారి తదితరులు జోనల్ కమీషనర్ గారిని కలవడం జరిగింది.




