Allwyn Colony: ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ నిరసన!

Allwyn Colony: మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ అరెస్టు, నీట్ విద్యార్థులపై లాఠీఛార్జ్ ని నిరసిస్తూ మహంకాళి నగర్ లో ర్యాలీ జరిగింది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 23 July 2026 8:34 PM IST
Allwyn Colony
X

Allwyn Colony: ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ నిరసన!

ఆల్విన్ కాలనీ: ఢిల్లీ లో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ ను ఖండిస్తూ కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే అరెస్టులను వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహంకాళి నగర్ చౌరస్తా నుండి గుడ్ విల్ హోటల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ గారు మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినందుకు కాక్రోచ్ పార్టీ విద్యార్థులు నిరసన తెలుపుతుంటే పోలీసులు దౌర్జన్యంగా లాఠీ ఛార్జ్ చేయడం కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయం అని అన్నారు. విద్యార్థులు ధర్నా చేస్తున్నారని పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లు ప్రశ్నలు వేస్తుంటే వాయిదా వేసి వారిని బయటకు పంపించారు. అదే విద్యార్ధుల దగ్గరకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నిరసన తెలపడానికి వెళ్తే వారిని కొట్టి అన్యాయంగా అరెస్ట్ చేశారని అన్నారు. యూత్ వల్లనే గెలిచిన బిజెపి పార్టీ అదే యూత్ ని ఇంత తీవ్రంగా కొట్టి దాడి చేస్తారా అని ప్రశ్నించారు.

ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోడీ బిజెపి పార్టీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాము భవిష్యత్తులో బిజెపికి ప్రజలే బుద్ధి చెప్తారని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, పట్వారీ శశిధర్, గోపాల్, భాస్కర్ రెడ్డి, వెంకట్ నాయక్, గుడ్ల శ్రీనివాస్, షౌకత్ అలీ మున్నా, పోశెట్టిగౌడ్, అగ్రవాసు, రాజు గౌడ్, లలన్, లింగం, సుధాకర్, సత్తయ్య, నిరంజన్, అంజయ్య యాదవ్, మహేష్, రమేష్, ఖలీమ్ జనార్ధన్, జగదీష్, రామకృష్ణ, మహమ్మద్ రఫీ ,రాజు, శ్రీను, వాసు.

మహిళలు శిరీష సత్తూర్, రాజ్యలక్ష్మి, వల్లి రమణ, రాజమణి, సంతోషమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story