Hyderabad: హయత్‌నగర్‌లో భూముల స్వాధీనంపై నిరసన ధర్నా!

Hyderabad: హయత్‌నగర్ మండలం హన్మగల్ ముదిరాజ్ కాలనీలో భూముల స్వాధీనం ఆపాలని కోరుతూ రైతులు, అఖిలపక్ష నాయకులు నిరసన ధర్నా చేపట్టారు.

AJAY, HAYATH NAGAR
Published on: 3 Aug 2026 1:39 PM IST
Hyderabad
X

Hyderabad: హయత్‌నగర్‌లో భూముల స్వాధీనంపై నిరసన ధర్నా!

Hyderabad: పేద ప్రజల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఆపాలని డిమాండ్ చేస్తూ హయత్‌నగర్ మండలం హన్మగల్ ముదిరాజ్ కాలనీలో రైతులు అఖిలపక్ష నాయకులతో కలిసి నిరసన ధర్నా చేపట్టారు.

సర్వే నంబర్ 255/1లో మొత్తం 74 ఎకరాల 37 గుంటల భూమి ఉండగా, అందులో సుమారు 18 ఎకరాల భూమికి సంబంధించి వివాదం కొనసాగుతోందని బాధితులు తెలిపారు.

గతంలో వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు రైతులు భూమిని చిన్న చిన్న ప్లాట్లుగా విభజించి పేద కుటుంబాలకు విక్రయించారని బీజేపీ నాయకులు తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. పేదల హక్కులకు భంగం కలిగితే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని నాయకులు హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అయితే ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సర్వే నంబర్ 255లోని భూమి మొత్తం ప్రభుత్వ స్థలమని తెలిపారు. 1974లో కొంతమంది రైతులకు ఒక సంవత్సరం కాలానికి లీజుకు ఇచ్చినట్లు, దాని ద్వారా రైతులకు ఎలాంటి చట్టపరమైన హక్కులు ఏర్పడవని పేర్కొన్నారు. 1985 నుంచి భూమి మొత్తం ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని తెలిపారు.

74 ఎకరాల భూమిని ప్రభుత్వం హౌసింగ్ స్కీం కింద కేటాయించిందని ఆర్డీవో వివరించారు. రైతుల నుంచి ఏదైనా ఫిర్యాదు అందితే, దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story