Vanasthalipuram: సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్!

Vanasthalipuram: డివిజన్ శక్తినగర్ కాలనీలో మాజీ కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి పర్యటించి, సీసీ రోడ్డు పనులు, డ్రైనేజీ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 8 Sept 2026 12:39 PM IST
Vanasthalipuram
X

Vanasthalipuram: సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్!

Vanasthalipuram: డివిజన్ పరిధిలోని శక్తినగర్ కాలనీలో మాజీ కార్పొరేటర్ శ్రీ వెంకటేశ్వర్ రెడ్డి పర్యటించారు. కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి రోడ్ నంబర్‌ 7, రోడ్ నంబర్‌ 4 ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

కొత్తగా మంజూరైన రోడ్ నంబర్‌ 7 సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలపై స్థానికులు, జీహెచ్‌ఎంసీ అధికారులతో చర్చించారు. నిర్మాణ పనుల కారణంగా కాలనీవాసులు ఇబ్బందులు పడకుండా సీసీ రోడ్డు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను మాజీ కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను స్వయంగా పరిశీలించిన వెంకటేశ్వర్ రెడ్డి.. సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story