Nallagutta: కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట: నల్లగుట్టలో అత్తిలి అరుణ పర్యటన
Nallagutta: సికింద్రాబాద్ నల్లగుట్టలో బీఆర్ఎస్ పోరుబాటలో భాగంగా మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ పర్యటించారు.
Nallagutta: కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట: నల్లగుట్టలో అత్తిలి అరుణ పర్యటన
Nallagutta: ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ 3వ రోజు నిరసనల్లో భాగంగా మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ డివిజన్ నాయకులతో కలిసి నల్లగుట్ట బస్తీ దవాఖానా, F-లైన్ ప్రాంతాల్లో పర్యటించారు.
బీఆర్ఎస్ హయాంలో రోజూ ఉన్న డాక్టర్లు, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో 3 రోజులకు ఒకసారి మాత్రమే వస్తుండటంతో పేదలకు వైద్యం అందడం లేదు. F-లైన్లో నెల రోజులుగా తాగునీటిలో డ్రైనేజీ మురుగునీరు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.10రోజులుగా తనిఖీల పేరిట కాలయాపన చేస్తున్నారు; పైప్లైన్ లోపాలు చూసే కెమెరా సాంకేతిక పరికరం ఒక్కటే ఉండటంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.
కలుషిత నీటి సమస్యను వెంటనే పరిష్కరించి, బస్తీ దవాఖానాలో నిత్యం డాక్టర్ను ఉంచకపోతే ప్రజలతో కలిసి ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డివిజన్ నాయకులు, ఆంజనేయులు, కోటి, అభిషేక్, టీనా, కిషోర్ విట్టల్ వెంకటేష్, జగ్గు, మహేష్, శివయ్య, శంకర్, మహేందర్ , ఆషారాణి, అనిత, పద్మ,ఆశ తదితరులు పాల్గొన్నారు.




