Boduppal: ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్‌లో భాగస్వామి కావాలి అజయ్ యాదవ్!

Boduppal: బోడుప్పల్‌లో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ హెల్ప్‌డెస్క్‌ను మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ సందర్శించారు.

KARUNAKAR, UPPAL
Published on: 28 July 2026 5:39 PM IST
Boduppal
X

Boduppal: ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్‌లో భాగస్వామి కావాలి అజయ్ యాదవ్!

Boduppal: మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని భీమ్‌రెడ్డి నగర్ కాలనీలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాలనీలోని కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ హెల్ప్‌డెస్క్‌ను బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బి-బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి, చెంగిచెర్ల డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోగుల దిలీప్ రెడ్డి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా పలువురు ఓటర్లకు ఎస్‌ఐఆర్ దరఖాస్తు ఫారాలను అందజేసి, ప్రతి అర్హత కల్గిన ఓటరు తప్పనిసరిగా ఈ ప్రక్రియలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఓటరు వివరాలను కచ్చితంగా నమోదు చేసి, నిర్ణీత గడువులోపు ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించాలని సూచించారు.

ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఓటర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని బీఎల్‌వోలకు సూచించారు. కార్యక్రమంలో బీఎల్‌వోలు రాకేష్, అనిత, సుశీల, బాబు, నరేందర్, బీఎల్‌ఏలు, డివిజన్ కాంగ్రెస్ నాయకులు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకుని ఓటరు జాబితాలో తమ వివరాలు సక్రమంగా నమోదయ్యేలా చూసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story