Vikarabad: స్వయంగా దరఖాస్తులు స్వీకరించిన కౌన్సిలర్ దంపతులు!
Vikarabad: ర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పింఛన్లు అందిస్తామని కౌన్సిలర్ జావిద్ వెల్లడించారు. ఆగస్టు 15 నాటికి కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేస్తామన్నారు.
Vikarabad: స్వయంగా దరఖాస్తులు స్వీకరించిన కౌన్సిలర్ దంపతులు!
వికారాబాద్: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పింఛన్లు అందించేందుకు ఎలక్షన్ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఆ దిశగా వార్డులో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించే దిశగా పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటున్నామని 8 వార్డ్ కౌన్సిలర్ జావిద్ అన్నారు. గురువారం అర్హులైన పెన్షన్ లబ్ధిదారుల అప్లికేషన్లను జావిద్ ఆయన భార్యతో కలిసి అర్హుల అప్లికేషన్లను తీసుకున్నారు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) నాటికి అర్హులైన కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసి పింఛన్లు మంజూరు చేయిస్తామన్నారు. అనర్హులను తొలగించి, ఆ స్థానంలో నిజమైన అర్హులైన పేదలకు కొత్త పింఛన్లు అందిస్తామన్నారు. పారదర్శకత కోసం అర్హత గల లబ్ధిదారుల ఎంపికను చురుగ్గా నిర్వహిస్తున్నామన్నారు. తాను మాట్లాడే వ్యక్తిని కాదని చేతల్లో చేయించి చూపించే నిజమైన ప్రజా నాయకుడిని ఈ సందర్భంగా వారు అన్నారు.




