Kompally: అప్పుల ఒత్తిడి తాళలేక ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
Kompally: హైదరాబాద్ కొంపల్లిలో అప్పుల బాధ తాళలేక ఇంజినీరింగ్ విద్యార్థి మేకల శివకుమార్ (21) ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య.
Kompally: అప్పుల ఒత్తిడి తాళలేక ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
Kompally: పేట్బషీరాబాద్, అప్పు తీర్చలేక ఓ విద్యార్థి ఆత్మహత్మ చేసుకున్నాడు. పేట్బషీరాబాద్ ఎస్ఐ రాజు వివ రాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం, మామి డాలపల్లి గ్రామానికి చెందిన మేకల శివకుమార్ (21) కొంపల్లి లోని దేవేందర్నగర్లో ఉంటూ మైసమ్మగూడలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు.
జల్సాలకు అలవాటు పడి స్నేహితులతోపాటు ఇతరుల వద్ద అప్పులు చేశాడు. తిరిగి అడుగుతుండటంతో ఒత్తిడికి లోనయ్యాడు. తల్లిదండ్రు లను డబ్బు అడిగితే తిడతారనే భయంతో సోమవారం గదిలో ఫ్యాన్కు ఉరే సుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తోటి స్నేహితులు వచ్చి చూసేసరికి అప్పటికే మరణించాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలిం చారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Next Story




