Miyapur: వైశాలి నగర్ అండర్ పాస్ వద్ద కొట్టుకుపోయిన వృద్ధుడు!
Miyapur: హైదరాబాద్ మియాపూర్ వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ వద్ద నాలా వరద నీటిలో పడి 70 ఏళ్ల వృద్ధుడు బాలయ్య గల్లంతయ్యారు.
Miyapur: వైశాలి నగర్ అండర్ పాస్ వద్ద కొట్టుకుపోయిన వృద్ధుడు!
Miyapur: మియాపూర్ వైశాలి నగర్ వద్ద విషాదం — వరద నీటిలో వృద్ధుడు గల్లంతు..
మియాపూర్ వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ వద్ద ఒక విచారకర సంఘటన చోటుచేసుకుంది. నాలా వరద నీటి ప్రవాహంలో పడి ఒక వృద్ధుడు గల్లంతయ్యారు.
బాధితుడిని హఫీజ్ పేట్ ప్రేమ్ నగర్‌కు చెందిన బాలయ్య (70)గా పోలీసులు గుర్తించారు.
స్థానికుల సమాచారం ప్రకారం, వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ వద్ద గత కొన్ని రోజులుగా నాలా మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. ఈ పనుల నిమిత్తం అధికారులు అండర్ పాస్‌ను తాత్కాలికంగా మూసివేశారు. అయితే, అక్కడికి సమీపంలో ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహంలో బాలయ్య ప్రమాదవశాత్తు కొట్టుకుపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే మియాపూర్ పోలీసులు, హైడ్రా (HYDRAA) మరియు ఎన్‌డిఆర్‌ఎఫ్ (NDRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన వృద్ధుడి ఆచూకీ కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.




