Secunderabad: మైనర్లకు సిగరెట్ల విక్రయం పాన్ మహల్‌పై ఈగల్ టీం దాడి!

Secunderabad: బోయిన్‌పల్లిలోని లిమ్రా పాన్ మహల్‌పై ఈగల్ టీం రైడ్. మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్, రూ. 60 వేల నిషేధిత పొగాకు ఉత్పత్తులు సీజ్.

Srikanth, Secunderabad
Published on: 31 Aug 2026 1:02 PM IST
Secunderabad
X

Secunderabad: మైనర్లకు సిగరెట్ల విక్రయం పాన్ మహల్‌పై ఈగల్ టీం దాడి!

Secunderabad: బోయిన్‌పల్లి పరిధిలోని లిమ్రా పాన్ మహల్ పై ఏకంగా 22 సార్లు నిఘా నిర్వహించిన ఈగల్ టీం, అక్కడ 14 మరియు 17 సంవత్సరాల వయసున్న ఇద్దరు మైనర్లకు సిగరెట్లు విక్రయించడాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

వెంటనే బోయిన్‌పల్లి పోలీసులతో కలిసి దుకాణంపై దాడి చేసిన ఈగల్ ఫోర్స్, దుకాణ యజమానిని మరియు ఒక పనివాడిని అరెస్ట్ చేసింది. దుకాణం నుండి సుమారు 60 వేల రూపాయల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసింది.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story