Quthbullapur: దుండిగల్ పోలీస్ పంజా.. 6 బైకులు స్వాధీనం!
Quthbullapur: కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ అయ్యారు.
Quthbullapur: దుండిగల్ పోలీస్ పంజా.. 6 బైకులు స్వాధీనం!
కుత్బుల్లాపూర్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అలవాటుగా బైక్ చోరీలకు పాల్పడుతు న్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సయేద్ మహబూబ్ పాషా (50)గా గుర్తించారు. అతను గతంలో కూడా పలు ప్రాంతాల్లో బైక్ చోరీలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, తాళాలు వేసి ఉంచని బైక్ లు, స్కూటీలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేసి, వాటిని తన ఇంటికి తీసుకెళ్లి సమీపంలోని పొదల్లో దాచిపెట్టి తర్వాత విక్రయించేవాడు. క్రైమ్ టీమ్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సాంకేతిక సాక్ష్యాలను సేకరించి, సాయంత్రం సమయంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈకేసులో పోలీసులు నిందితుడి ఇంటినుంచి 2బైక్ లు, 4స్కూటీలు (మొత్తం 6వాహనాలు) సుమారు రూ.3 లక్షల విలువైన ఆస్తి స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగతనాలకు సంబంధించి దుండిగల్ పీఎస్ 3 కేసులు, కాచిగూడ 1, మేడ్చల్ 1, బోయి స్పల్లి 1 నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ మేడ్చల్ ఏసీపీ ఆధ్వర్యంలో, దుండిగల్ ఎస్ హెచ్ సతీష్, డి ఐ బాల్ రెడ్డి, డి ఎన్ ఈశ్వర్, క్రైమ్ సిబ్బంది సమ న్వయంతో విజయవంతంగా పూర్తి చేశారు.




