Hyderabad: మన్మోహన్ సింగ్ ఫెలోస్ తొలి బ్యాచ్ పూర్తి: రాహుల్ అభినందనలు

Hyderabad: డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోస్ తొలి బ్యాచ్ పూర్తి చేసుకున్న యువతను ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అభినందించారు.

G. Rama Krishna, Hyderabad
Published on: 15 Sept 2026 10:03 PM IST
Hyderabad
X

Hyderabad: మన్మోహన్ సింగ్ ఫెలోస్ తొలి బ్యాచ్ పూర్తి: రాహుల్ అభినందనలు

Hyderabad: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద నిర్వహిస్తున్న 'మన్మోహన్ సింగ్ ఫెలోస్' తొలి బ్యాచ్‌ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇందిరా భవన్ లో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ గారు, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC ) చైర్ పర్సన్ మధుయాష్కి గౌడ్ గారు, మాజీ చైర్ పర్సన్ ప్రవీణ్ చక్రవర్తి గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు.. శిక్షణ పూర్తి చేసుకున్న మన్మోహన్ సింగ్ ఫెలోస్‌తో మాట్లాడి వారితో అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రగతిశీల భారత నిర్మాణం పట్ల వారు చూపుతున్న ఆసక్తి, అభిరుచిని అభినందించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆలోచనలు, విధానాలు, దేశాభివృద్ధిలో ప్రొఫెషనల్స్‌ పాత్ర వంటి అంశాలపై చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా ప్రొఫెషనల్స్‌ను కాంగ్రెస్ పార్టీతో అనుసంధానం చేయడం, ఏఐపీసీని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా నాయకులు చర్చించారు.

'మన్మోహన్ సింగ్ ఫెలోస్' రెండో బ్యాచ్‌ కోసం దరఖాస్తుల ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దేశ ప్రగతి, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, అభివృద్ధిపై ఆసక్తి ఉన్న యువతతో పాటు వివిధ రంగాల్లోని వృత్తిని నిపుణులు, మేధావులు ఈ ఫెలోస్ లో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు.

G. Rama Krishna, Hyderabad

G. Rama Krishna, Hyderabad