Hyderabad: జనసేన తెలంగాణ అధికార ప్రతినిధిగా డా. గడల శ్రీనివాసరావు నియామకం!

Hyderabad: జనసేన తెలంగాణ అధికార ప్రతినిధిగా డా. గడల శ్రీనివాసరావును నియమించిన పవన్ కళ్యాణ్. పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకే తొలి ప్రాధాన్యమన్న గడల.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 21 Aug 2026 3:54 PM IST
Hyderabad
X

Hyderabad: జనసేన తెలంగాణ అధికార ప్రతినిధిగా డా. గడల శ్రీనివాసరావు నియామకం!

Hyderabad: జనసేన పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధిగా తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్, పార్టీ రాష్ట్ర నాయకులు డా. గడల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు.

ఈ నియామకంపై డా. గడల శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, ప్రజా సమస్యలపై జనసేన వైఖరిని స్పష్టంగా, హుందాగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.

ప్రజాసేవే తన రాజకీయ ప్రయాణానికి ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. “బాధ్యత మారవచ్చు.. కానీ నా లక్ష్యం ఒక్కటే.. ప్రజలే ప్రథమం, ప్రజాసేవే పరమావధి” అని స్పష్టం చేశారు.

తెలంగాణలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకువస్తూ పార్టీకి, ప్రజలకు మధ్య బలమైన వారధిగా పనిచేస్తానని డా. గడల శ్రీనివాసరావు తెలిపారు.

తనపై విశ్వాసం ఉంచిన పవన్ కళ్యాణ్‌తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పార్టీ నాయకత్వం, జనసైనికులు, వీర మహిళలు, పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story