Ibrahimpatnam: ఇబ్రహీంపట్నంలో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ!

Ibrahimpatnam: ఇబ్రహీంపట్నంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ ఘనంగా నిర్వహించారు.

RAVI, IBRHAMIPATNAM
Published on: 12 Aug 2026 1:22 PM IST
Ibrahimpatnam
X

Ibrahimpatnam: ఇబ్రహీంపట్నంలో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ!

Ibrahimpatnam: మున్సిపల్ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ లొ మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. బూర నర్సయ్య గౌడ్ మరియు ప్రభుత్వ విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన బూర నర్సయ్య గౌడ్ గతంలో 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో అణగదొక్కబడి ఆకలికి అలమటించామని ఎంతోమంది స్వాతంత్రం కోసం శ్రమించి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టడం జరిగిందని. వచ్చిన స్వతంత్రాన్ని కాపాడుకోవాలని కోరారు. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రధాని ఈ దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకు వెళుతూ ప్రగతి వైపు తీసుకు వెళుతున్నాడని ఈ సందర్భంగా చెప్పారు. భారత దేశ వ్యాప్తంగా

హర్ ఘర్ తిరంగా – దేశభక్తి ప్రతి ఇంటా, త్రివర్ణ పతాకం ఎగురవేయాలని చెప్పారు. . ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు. . వాయిస్ బూర నర్సయ్య గౌడ్

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM

Next Story