Serilingampally: శంషిగూడలో ఓటరు జాబితా సవరణ పరిశీలన వెంకటేష్ గౌడ్

Serilingampally: శేర్లింగంపల్లి శంషిగూడలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) పరిశీలన. నకిలీ, ద్వంద్వ ఓట్ల నిర్మూలనకు కృషి చేయాలని మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ పిలుపు.

Maruthisagar, Kukatpally
Published on: 27 July 2026 10:20 PM IST
Serilingampally
X

Serilingampally: శంషిగూడలో ఓటరు జాబితా సవరణ పరిశీలన వెంకటేష్ గౌడ్

శేర్లింగంపల్లి: శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని శంషిగూడ డివిజన్ పరిధిలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) మ్యాపింగ్ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా భాగస్వామి కావాలని కోరారు.

బీఎల్‌ఓలు అందజేసే ఎన్యూమరేషన్ ఫారంలో పూర్తి వివరాలను సక్రమంగా నమోదు చేసి ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు.

బీఎల్‌ఓలు ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, ఒకే వ్యక్తికి ఉన్న ద్వంద్వ ఓట్లను గుర్తించి తొలగించడంతో పాటు నకిలీ ఓట్ల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్, పోశెట్టి గౌడ్, సుధాకర్, అంజలి తదితరులు పాల్గొన్నారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story