ఎల్బీనగర్ లో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ: అమరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం - బండారు దత్తాత్రేయ
Doddi Komaraiah Statue: ఎల్బీనగర్ కూడలిలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Doddi Komaraiah Statue: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్నీ ఎల్బీనగర్ కూడలిలోని కురుమ యువ చైతన్య సమితి ఆద్వర్యంలో ఆవిష్కరణ చేశారు. దొడ్డి కొమరయ్య 99వ జయంతి వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారబించారు.
ఎల్బీనగర్లో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం స్ఫూర్తి దాయకమన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు క్యామ మల్లేష్, బీసీ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, కురుమ యువ చైతన్య సమితి అధ్యక్షులు కుండే వెంకటేష్ పాల్గొన్నారు.
Next Story




