LB Nagar: భక్తిశ్రద్ధలతో నరసింహస్వామి కళ్యాణం.. పాల్గొన్న ఎమ్మెల్యే
LB Nagar: ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురిలో గల ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జయంతి మరియు కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి.
LB Nagar: భక్తిశ్రద్ధలతో నరసింహస్వామి కళ్యాణం.. పాల్గొన్న ఎమ్మెల్యే
ఎల్బీనగర్: చైతన్యపురి డివిజన్ పరిధిలోని శ్రీశ్రీశ్రీ (కోసగుండ్ల) ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు నిర్వహించిన లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి-కళ్యాణ మహోత్సవంలో ఈరోజు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, భక్తులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు.అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ దేవస్థానం అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి,ఫణిగిరి కాలనీ కోసగుండ్ల నర్సింహాస్వామి దేవాలయం చైర్మన్ కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీహరి, రత్నాకర్ రెడ్డి, ప్రభు, రామారావు, గణేష్, నాగరాజు, మహేష్, రాకేష్, జలంధర్, నరేశ్, శ్రీధర్ మరియు స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




