Osmania University: ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి శరత్ నాయక్

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ గిరిజన శక్తి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు డిమాండ్.

HARISH, TARNAKA
Published on: 7 Aug 2026 9:35 PM IST
Osmania University
X

Osmania University: ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి శరత్ నాయక్

ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణలోని ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలని తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు కొర్ర శరత్ నాయక్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ గిరిజన శక్తి ఆధ్వర్యంలో వివిధ విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సేవలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్, ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు, తెలంగాణ మాల సంఘాల చైర్మన్ మందాల భాస్కర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.

తెలంగాణలో ప్రస్తుతం 12 ప్రైవేట్, 5 డీమ్డ్ విశ్వవిద్యాలయాలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పటికీ, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అమలు చేయాల్సిన రిజర్వేషన్లను విస్మరిస్తున్నారని వారు ఆరోపించారు. విద్య, ఉపాధి అవకాశాల్లో సామాజిక న్యాయం సాధించాలంటే ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయడం తప్పనిసరి అని వారు పేర్కొన్నారు.

రిజర్వేషన్లు అమలు చేయని ప్రైవేట్ యూనివర్సిటీల అనుమతులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 13న హైదరాబాద్‌లోని జలవిహార్‌లో మేధావులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, జిల్లా కేంద్రాల్లో అవగాహన సమావేశాలు నిర్వహించి ఉద్యమాన్ని విస్తరిస్తామని తెలిపారు. అలాగే ప్రైవేట్ విశ్వవిద్యాలయాల పాలన, ఫీజుల నియంత్రణ, నియామకాలలో పారదర్శకత తీసుకురావాలని, నిబంధనలు ఉల్లంఘించే యూనివర్సిటీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యార్థుల రాజ్యాంగబద్ధ హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ గిరిజన శక్తి వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బు నాయక్, ప్రధాన కార్యదర్శి విజయ్ నాయక్, నరేష్ నాయక్, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్ మాదిగ, ఎస్ఎఫ్ఐ నాయకుడు రవి నాయక్, ఏఎస్ఎఫ్ఐ నాయకుడు ఉదయ్ కుమార్, పీడీఎస్‌యూ నాయకుడు సుమంత్,

ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ చైర్మన్ రవీందర్ నాయక్, ఎల్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ నాయక్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ సెక్రటరీ మహేష్, నిరుద్యోగ జేఏసీ నాయకురాలు అస్మా, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బొరెల్లి సురేష్, ఏఎంఎస్ ఓయూ అధ్యక్షుడు నామ సైదులు,

తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ రమేష్ రాథోడ్, మాదిగ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్, సేవలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్, ప్రధాన కార్యదర్శి లాలూ నాయక్, అడ్వకేట్ కృష్ణ నాయక్, బాలాజీ నాయక్, హనుమంతు నాయక్, సతీష్ నాయక్, రాజశేఖర్, రాజు, రమేష్, వినయ్, ప్రకాష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story