Maheshwaram: కొత్వాల్ చెరువులో మునిగి పాలిటెక్నిక్ విద్యార్థి మృతి!
Maheshwaram: కేసీ తండా కొత్వాల్ చెరువులో ఈతకు వెళ్లి పాలిటెక్నిక్ విద్యార్థి సుప్రతిక్ మృతి. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంపై ఏబీవీపీ ఆగ్రహం, సస్పెండ్ చేయాలని డిమాండ్.
Maheshwaram: కొత్వాల్ చెరువులో మునిగి పాలిటెక్నిక్ విద్యార్థి మృతి!
Maheshwaram: ఈత సరదా ఒక పాలిటెక్నిక్ విద్యార్థి ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన మహేశ్వరం మండలంలో చోటుచేసుకుంది.
మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండా సమీపంలోని కొత్వాల్ చెరువులో ఈతకు వెళ్లిన సుప్రతిక్ (17) మునిగి మృతి చెందాడు. సుప్రతిక్ మహేశ్వరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డి సి ఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం బుధవారం మధ్యాహ్నం భోజనం అనంతరం సుప్రతిక్ తన నలుగురు స్నేహితులతో కలిసి కొత్వాల్ చెరువుకు ఈతకు వెళ్లాడు. ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు లోతైన నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
విషయం తెలుసుకున్న విద్యార్థులు వెంటనే కళాశాల ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇచ్చారు. ప్రిన్సిపాల్ పోలీసులకు తెలియజేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏబీవీపీ డిమాండ్:
ఈ ఘటనపై ఏబీవీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏబీవీపీ మహేశ్వరం శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వనవాసి కో-కన్వీనర్ రాజేష్ మాట్లాడుతూ, విద్యార్థుల భద్రతకు బాధ్యత వహించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఖండించారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్న అధికారులు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించాలి. ఒక నిండు ప్రాణం పోవడం అత్యంత బాధాకరం" అని అన్నారు.మహేశ్వరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని, ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థుల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు.




