Kadthal: అంగరంగ వైభవంగా రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం!

Kadthal: ఎక్వాయిపల్లిలో జరిగిన రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 28 July 2026 9:52 PM IST
Kadthal
X

Kadthal: అంగరంగ వైభవంగా రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం!

కడ్తాల్: కడ్తాల్ మండలం ఎక్వాయి పల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మించి ఒక సంవత్సరం కావస్తున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా వేదమంత్రోచరణ మధ్య జరుపుకున్నారు.

గ్రామానికి చెందిన మహిళలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ కళ్యాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిసిబి డైరెక్టర్ ఆమనగల్లు సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, మాజీ ఎంపీటీసీ లచ్చిరాం నాయక్, మాజీ వైస్ ఎంపీపీ జోగు వీరయ్య లతో కలిసి కళ్యాణంలో పాల్గొన్నారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులు ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కరుణాకర్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ ముత్యాలు, రాఘవేందర్, సుమన్, శంకరయ్య, వార్డు సభ్యులు బిక్షపతి, మహేష్ యాదవ్, వంశీ యాదవ్, వెంకట శివ, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story