Kadthal: కడ్తాల్‌లో సీసీటీవీ షోరూమ్, రెస్టారెంట్ ప్రారంభం!

Kadthal: కడ్తాల్‌లో ఆర్‌పీఎం సీసీటీవీ, సోలార్ ప్రాజెక్ట్స్ షోరూమ్ మరియు ఆర్‌జేఎస్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన మాజీ జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 6 Sept 2026 7:04 PM IST
Kadthal
X

Kadthal: కడ్తాల్‌లో సీసీటీవీ షోరూమ్, రెస్టారెంట్ ప్రారంభం!

Kadthal: కడ్తాల్ మండల కేంద్రంలో సాంకేతిక విప్లవానికి సరికొత్త వేదిక దొరికింది. స్థానిక గాంధీ ప్లాజాలో (సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ పక్కన) అత్యంత అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన "RPM సీ.సీ.టీ.వీ. సెక్యూరిటీ సొల్యూషన్స్ & సోలార్ ప్రాజెక్ట్స్" దుకాణం ఈరోజు అత్యంత అట్టహాసంగా ప్రారంభమైంది.

ప్రముఖ యువ వ్యాపారవేత్త రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ భారీ షోరూమ్‌ను కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ,రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల దశరథ్ నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కత్తిరించి అత్యంత వైభవంగా ప్రారంభించారు.

రమేష్ దంపతులకు సన్మానించి ప్రారంభోత్సవం అనంతరం షోరూం లోపల ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్య అతిథి జర్పుల దశరథ్ నాయక్ సమక్షంలో స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఏకమై.. దుకాణ యజమాని రమేష్ మరియు ఆయన ధర్మపత్నిని శాలువాలతో, పూలమాలలతో అత్యంత ఘనంగా సన్మానించారు.

కొత్తగా వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెడుతున్న ఈ యువ జంటకు "వ్యాపారంలో తిరుగులేని విజయాలు అందుకోవాలి" అంటూ పెద్దలు మనస్ఫూర్తిగా దీవెనలు అందించారు. ఈ సన్మాన దృశ్యం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

జర్పుల దశరథ్ నాయక్ మాట్లాడుతూ "కాలం మారింది.. టెక్నాలజీ పెరిగింది.. ఇప్పుడు ప్రతి ఇంటికి, ప్రతి షాప్‌కు సీసీ కెమెరాల రక్షణ కవచం తప్పనిసరి!" అని స్పష్టం చేశారు.పెరుగుతున్న కరెంట్ బిల్లుల భారం నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు, కాలుష్య రహిత సమాజం కోసం సోలార్ ప్రాజెక్టులు ఎంతో అద్భుతమైన మార్గమని కొనియాడారు.

కడ్తాల్ ప్రజల చెంతకే ఇలాంటి అంతర్జాతీయ స్థాయి బ్రాండెడ్ సెక్యూరిటీ సేవలను తీసుకొచ్చిన రమేష్ సాహసాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు అలాగే గోవిందపల్లి లోని రతన్ జై రామ్ శివ ఆర్ జే ఎస్ రెస్టారెంట్ ను కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల దశరథ్ నాయక్ ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు ఇలాంటి ఆధునిక రెస్టారెంట్లు ముందుకు రావడం అభినంద నీయమని అన్నారు. స్థానికులకు మెరుగైన సేవలు అందిస్తూ ఈ రెస్టారెంట్ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ ప్రారంభోత్సవ వేడుకలో మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, స్థానిక వ్యాపార ప్రముఖులు మరియు రమేష్ స్నేహితులు, బంధువులు భారీ సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రేమ జవహర్లాల్ నాయక్ మాజీ సర్పంచ్ తులసి రామ్ నాయక్ మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ ఉప సర్పంచ్ హిరాసింగ్ నాయక్ నాయకులు బాబా చందన్ శంకర్ శివ జగన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story