Chandanagar: మంచినీళ్లిచ్చిన బాలుడిపైనే కత్తితో దాడి చేసి ఫోన్ లూటీ!
Chandanagar: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హుడా కాలనీ రైల్వే ట్రాక్ వద్ద అర్ధరాత్రి మంచినీళ్లు అడిగి బాలుడిపై కత్తితో దాడి చేసి ఫోన్ ఎత్తుకెళ్లారు.
Chandanagar: మంచినీళ్లిచ్చిన బాలుడిపైనే కత్తితో దాడి చేసి ఫోన్ లూటీ!
చందానగర్: చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. మంచినీళ్లు కావాలంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు, బాలుడిపై కత్తితో దాడి చేసి సెల్ ఫోన్ అపహరించుకెళ్లిన ఘటన కలకలం రేపింది.
ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.... చందానగర్ పరిధిలోని హుడా కాలనీ రైల్వే పట్టాల పక్కన గుడిసెలో నివసించే జాన్ సయ్యద్ (16) అనే బాలుడి వద్దకు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చారు. నిందితులు బాలుడిని మంచినీళ్లు అడగడంతో, జాన్ సయ్యద్ వారికి వాటర్ బాటిల్ అందించాడు.నీళ్లు తాగి బయటకు వెళ్లిన ఆ ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి తిరిగి గుడిసెలోకి వచ్చారు. బాలుడిని బెదిరించి అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను లాక్కునేందుకు ప్రయత్నించారు. బాలుడు గట్టిగా అరవడంతో, నిందితులు తమ వద్ద ఉన్న కత్తితో అతనిపై దాడి చేసి చేతిపై గాయపరిచారు.
అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.




