Malkajgiri: కాలేజీలో సీపీఆర్ అవగాహన ప్రాణాలు కాపాడే నైపుణ్యాలపై శిక్షణ!

Malkajgiri: మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో సీపీఆర్ (కార్డియో పల్మనరీ రీససిటేషన్) అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 5 Aug 2026 7:53 AM IST
Malkajgiri
X

Malkajgiri: కాలేజీలో సీపీఆర్ అవగాహన ప్రాణాలు కాపాడే నైపుణ్యాలపై శిక్షణ!

Malkajgiri: మల్కాజిగిరి డిగ్రీ కళాశాలలో సిపిఆర్ అవగాహన కార్యక్రమం

అత్యవసర పరిస్థితుల్లో గుండెపోటు లేదా శ్వాస ఆగిపోయిన వ్యక్తికి సకాలంలో సీపీఆర్‌ (కార్డియో పల్మనరీ రీససిటేషన్) అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని సెంజాన్ అంబులెన్స్ ఇండియా సీనియర్ ఫ్యాకల్టీ కలారి సంతోష్ కుమార్ పేర్కొన్నారు. మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎన్‌ఎస్‌ఎస్‌ మూడు యూనిట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సీపీఆర్‌ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సి పి ఆర్ విధానం గురించి చెబుతూ సీపీఆర్‌ ప్రతి పౌరుడు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన ప్రాణరక్షక నైపుణ్యమని అన్నారు.

ప్రమాదాలు, గుండెపోటు,శ్వాస సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ వచ్చేలోపు బాధితుడికి సీపీఆర్‌ అందించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని వివరించారు.అనంతరం విద్యార్థుల సమక్షంలో సీపీఆర్‌ చేసే సరైన విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించి,విద్యార్థులతో సాధన చేయించారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ బండి రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యతో పాటు ఇలాంటి జీవన నైపుణ్యాలను కూడా అలవర్చుకోవాలని సూచించారు.సమాజ సేవలో నేటి యువత ముందుండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌ఎస్‌ మూడు యూనిట్ల ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు డాక్టర్‌ ఎడ్ల ప్రదీప్‌,డాక్టర్‌ హరిత, డాక్టర్‌ జి.ఎన్‌.జగన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అడవి రాజు,ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎస్‌. రాజేశ్‌కుమార్‌, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ గుణాకర్‌,డాక్టర్‌ మల్లికతో పాటు అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story