Rangareddy: ఇంటి నిర్మాణ అనుమతుల్లో పేదలను ఇబ్బంది పెట్టొద్దు!

Rangareddy: జిహెచ్‌ఎంసి ఆదిభట్ల సర్కిల్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 29 Aug 2026 5:19 PM IST
Rangareddy
X

Rangareddy: ఇంటి నిర్మాణ అనుమతుల్లో పేదలను ఇబ్బంది పెట్టొద్దు!

Rangareddy: ప్రైవేటు సర్వే నెంబర్ల ముసుగులో ప్రభుత్వ భూముల్లో ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, నిబంధనల పేరుతో పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లకు నిర్మాణా అనుమతులు జారీ చేయకుండా రూల్స్ ని అడ్డంపెట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి ఆదిభట్ల సర్కిల్ తుర్కయంజాల్, రాగన్న గూడ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఎం రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు డి కిషన్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి ఆదిభట్ల సర్కిల్ పరిధిలో ఉన్న తొర్రూర్ తుర్కయంజాల్ కొంగరకలాన్ ఆదిభట్ల డివిజన్లలో ఉన్న అన్ని గ్రామాలు ఇప్పటికీ గ్రామపంచాయతీ స్వభావంతోనే ఉన్నాయని ఈ గ్రామాల్లో 1974, 1984 కి ముందే లే అవుట్లు అయినప్పటికీ 2020లో నిబంధన ప్రకారం ఎల్ఆర్ఎస్ లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదనే కారణంతో, ముఖ్యంగా కన్జర్వేషన్ జోన్ పేరుతో ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదని, ముఖ్యంగా 18 ఫీట్ల కంటే తక్కువ ఉన్న ప్లాట్లకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రజలు తమ ఇంటి నిర్మాణం కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తుర్కయంజాల్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో గ్రామకంఠం భూములకు పలు రకాల నిబంధనలు పెట్టి వేల రూపాయలు అధికంగా ఫీజులు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తాతల కాలం నుండి వారసత్వంగా వచ్చిన పేదల గ్రామకంఠ భూములలో అనుమతులకు అడిగినంత ముడుపులు చెల్లించకపోతే రకరకాల సాకులతో అనుమతులు రిజెక్ట్ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భూమి అని తెలిసినా ప్రైవేట్ సర్వే నెంబర్ల ముసుగులో వేలు లక్షల్లో డబ్బులు తీసుకుని టౌన్ ప్లానింగ్ అధికారులు ఇంటి నిర్మాణం అనుమతులు ఇస్తున్నారని ఆరోపణ చేశారు.

ప్రధానంగా మన్నెగూడ, ఇంజాపూర్ సర్వేనెంబర్ 126 మరియు మునగనూరు సర్వేనెంబర్ 38, 44 లో ఈ తంతు పెద్ద ఎత్తున జరుగుతుందని అన్నారు సర్కిల్ పరిధిలోని కొన్ని గ్రామాల్లో 150 గజాల లో కూడా నాలుగు ఐదు అంతస్తుల భవనాలు ఎలా కడుతున్నారని వారు ప్రశ్నించారు ఇప్పటికైనా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఏం సత్యనారాయణ కే అరుణ్ కుమార్ పొడేళ్ల శ్రీనివాసులు ఏ భాస్కర్ రెడ్డి కేంసారం సత్యనారాయణ అరెడ్ల మాధవరెడ్డి మద్దెల యాదయ్య సిలువేర్ రాజు సార్ల రాములు తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story