LB Nagar: ప్రభుత్వ టీచర్లతో ‘ఎస్‌ఐఆర్’ విధులు ఆపాలి!
LB Nagar: ఉపాధ్యాయులతో ఎస్‌ఐఆర్ (SIR) విధులు చేయించడం వల్ల ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు నష్టపోతున్నారని సీపీఎం నేత డి. కిషన్ విమర్శించారు. రేపు స్కూళ్ల బంద్.
LB Nagar: ప్రభుత్వ టీచర్లతో ‘ఎస్‌ఐఆర్’ విధులు ఆపాలి!
LB Nagar: జిహెచ్ఎంసి ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని జెడ్పిహెచ్ఎస్ ఇంజాపూర్ స్కూల్ లో ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు విసిట్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి కిషన్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు తీవ్రంగా తిష్ట వేషాయని అన్నారు.
విద్యార్థుల సంఖ్య కనుగుణంగా తరగతి గదులు లేక అన్ని సబ్జెక్టులకు సరిపడా ఉపాధ్యాయులు లేక ఆటో స్థలం మూత్రశాలలో మరుగుదొడ్లు వంటగదులు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వం చెప్పట్టిన SIR విధులను ప్రభుత్వ ఉపాధ్యాయులచే నిర్వహించడం వల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని అన్నారు.
లక్షల్లో ఫీజులు వసూలు చేసే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లోని టీచర్స్ చే SIR విధులను ఎందుకు నిర్వహించడం లేదని వండిపడ్డారు అంటే పరోక్షంగా పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు సిలబస్ నష్టపోయి మరింత అన్యాయం కావాలా అని ప్రశ్నించారు ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడం కోసం స్థానిక సమస్యలను పరిష్కరించి ప్రైవేట్ కార్పొరేట్ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా రేపు వామపక్ష విద్యార్థి సంఘాలు తలపెట్టిన విద్యాసంస్థల బందుకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు పలుకుతుందని అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, తుర్కయంజాల్ కార్యదర్శి డి కిషన్ కమిటీ సభ్యులు ఏం సత్యనారాయణ పి శ్రీనివాసులు కే వెంకటకృష్ణ కే శ్రీరామ్ మూర్తి ఐ భాస్కర్ నాయకులు ఐ కృష్ణ, బి శంకరయ్య, మాధవరెడ్డి, కె సత్యం, ప్రవీణ్, నరసింహ, వేణు, కార్తీక్, సైదులు తదితరులు పాల్గొన్నారు.




