Marpalli: మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలు పరిష్కరించాలి.. సీపీఎం
Marpalli: మర్పల్లి ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ డిమాండ్. ఆసుపత్రిని సందర్శించిన బృందం.
Marpalli: మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలు పరిష్కరించాలి.. సీపీఎం
మర్పల్లి: వికారాబాద్ జిల్లా, మర్పల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రిని సిపిఎం బృందం పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ సమస్యలు తెలుసుకుని మాట్లాడుతూ ఆసుపత్రిలో అనేక రకాల సమస్యలు మధ్యన పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు.
మంచి భోజనం లేదు. పండ్లు కూరగాయలు లేవు స్కానింగ్, అల్ట్రాసౌండ్ రిపేర్లు ఉన్నవి. వెంటనే బాగు చేయించాలి. ఆసుపత్రిలో ఉన్న కాళీ పోస్టులు డాక్టర్స్, నర్సులను వెంటనే భర్తీ చేయాలి అని ప్రభుత్వం కు డిమాండ్ చేశారు. అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని నియమించాలి. హాస్పిటల్లో డాక్టర్స్ కు మరియు పేషెంట్లకు ఫుడ్ సప్లై చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని రోజు టిఫిన్ కూరగాయలతో కూడిన భోజనం గుడ్లు అరటి పండ్లు ఇవ్వాలి.
నిరంతరం పోలీస్ గార్డ్ ఏర్పాటు చేయాలి హాస్పిటల్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ 20మంది కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలి కనీస విత్తనాలు అమలు 26వేలు చేయాలి. ఈఎస్ఐ పీఎఫ్ ప్రమాదం సౌకర్యం కల్పించాలి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. హాస్పిటల్ చుట్టూ కాంపౌండ్ వాల్ గేట్లు ఏర్పరిచేయాలి ప్రభుత్వం అంబులెన్స్ ఏర్పాటు చేయాలి.హాస్పిటల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలి.
మెడికల్ డిపార్ట్మెంట్ జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ స్పీకర్ ఎమ్మెల్యే నిరంతరం *ప్రభుత్వ ఆసుపత్రులు పర్యటించాలి. పేద ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి ప్రతి ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ స్థాయిలో పేదలకు వైద్యం అందించాలి. అందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి సిపిఎం డిమాండ్ చేస్తుంది.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పర నరసింహులు, సిఐటియు మండల అధ్యక్షులు ఆనందం. బాబు.లక్ష్మీ, రాజు అంతమ్మ, లక్ష్మి పార్వతమ్మ మంజుల పెంతమ్మ అనంతమ్మ నిర్మల శ్యామల అనిత సంతోష కవిత స్వారుపురాని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు




