Malkajgiri: సెప్టెంబర్ 1న సీపీఐ ‘చలో ఢిల్లీ’.. గోడపత్రిక ఆవిష్కరణ!

Malkajgiri: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న సీపీఐ చేపట్టనున్న ‘చలో ఢిల్లీ’ పోస్టర్‌ను మల్కాజిగిరిలో ఆవిష్కరించారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 3 Aug 2026 5:54 PM IST
Malkajgiri
X

Malkajgiri: సెప్టెంబర్ 1న సీపీఐ ‘చలో ఢిల్లీ’.. గోడపత్రిక ఆవిష్కరణ!

మల్కాజిగిరి: మల్కాజిగిరి వినాయక్ నగర్ సిపిఐ కార్యాలయంలో సిపిఐ మండల కార్యదర్శి కాసర్ల నాగరాజు ఆధ్వర్యంలో సెప్టెంబరు1న చలో ఢిల్లీ గోడ పత్రికను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టి యాదయ్య గౌడ్,కాసర్ల నాగరాజు హాజరై మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ దశాబ్ద కాలంలో క్రమంగా ఆందోళన నిరాశ, పెరుగుతున్న కష్టాలకు దారితీసిందని ఎన్నికల సందర్భంగా బిజెపి ప్రభుత్వం ఉపాధి సంక్షేమం సుపరిపాలన,మెరుగైన భవిష్యత్తును అందిస్తానని వాగ్దానం చేసిందని కానీ దానికి బదులుగా దేశంలో నేడు పెరుగుతున్న నిరుద్యోగం భరించలేని ధరల పెరుగుదల విస్తరిస్తున్న అసమానతలు బలహీనపడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూచించుకుపోతున్న ప్రజాస్వామ్యం, పెరుగుతున్న సామాజిక ఉద్రిక్తతతలను ఎదుర్కొంటుందని.

ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలని సార్వత్రిక విద్య ఆరోగ్యం అందుబాటులోకి తేవలన్నారు. ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలని కార్మికుల కార్మికుల హక్కులను పరిరక్షించాలని బ్యాలెట్ పేపర్ పద్ధతుల ఎన్నికలను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ లతో ఆగస్టు 6 నుండి 14 వరకు దేశవ్యాప్త రాజకీయ ప్రచారం పాదయాత్రలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ పాదయాత్రలను సెప్టెంబర్ 1న మార్పు కోసం చలో ఢిల్లీ కార్యక్రమాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు పి.సత్యనారాయణ, రొయ్యల గిరిజ కృష్ణమూర్తి,ఏఐటియుసి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.కె అజీజ్, కార్యదర్శి జె వెంకటరమణ,సిపిఐ నాయకులు బి యాదగిరి,సయ్యద్ యూసుఫ్,బి లింగం,బి శంకరయ్య గౌడ్ బి రవి,జి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story