Quthbullapur: కామ్రేడ్ సంతోష్ మరణం పార్టీకి తీరని లోటు: సీపీఐ నేతలు!

Quthbullapur: గుబురుగుట్ట సీపీఐ శాఖ సహాయ కార్యదర్శి కామ్రేడ్ సంతోష్ అనారోగ్యంతో మృతి చెందగా సీపీఐ జాతీయ, జిల్లా నాయకులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 4 Aug 2026 6:59 PM IST
Quthbullapur
X

Quthbullapur: కామ్రేడ్ సంతోష్ మరణం పార్టీకి తీరని లోటు: సీపీఐ నేతలు!

కుత్బుల్లాపూర్: గుబురుగుట్ట శాఖ సహాయ కార్యదర్శి యువజన నాయకుడు అనారోగ్యంతో మృతి చెందిన కామ్రేడ్ సంతోష్ మృతదేహానికి పూలమాలలు వేసి సిపిఐ నాయకులు నివాళులు అర్పించారు.

పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కృషిచేసి పార్టీ విధేయుడిగా పనిచేసిన ఒక యువకుడ్ని కోల్పోవడం పార్టీకి తీరని నష్టమని సిపిఐ నాయకులు అన్నారు. వారికి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నామని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వారి కుటుంబనికి అండగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు యూసుఫ్, జిల్లా కార్యదర్శి ఉమామహేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యేసు రత్నం, ఏ మండల కార్యదర్శి స్వామి సహాయ కార్యదర్శిలు రాములు, హరినాథ్ రావు, ప్రజానాట్యమండలి అధ్యక్షులు ప్రవీణు అధ్యక్షులు బాబు, శాఖ కార్యదర్శులు కొండయ్య వెంకటేష్, సిపిఐ నాయకులు ఇమామ్ యాదగిరి వెంకటేష్ అరవింద్ శ్రీకాంత్ జంబు తదితరులు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story