Karimnagar: మోడీ పాలనలో రాజ్యాంగం నిర్వీర్యం: చాడ వెంకటరెడ్డి
Karimnagar: ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి విమర్శించారు.
Karimnagar: మోడీ పాలనలో రాజ్యాంగం నిర్వీర్యం: చాడ వెంకటరెడ్డి
Karimnagar ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రానికి చేరుకున్న సిపిఐ ప్రచార జాతా బస్సు యాత్రలో పార్టీ శ్రేణులతో కలిసి చాడ వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్రలు, పాదయాత్రలు చేస్తున్నామని తెలిపారు. దేశాన్ని పూర్తిగా నియంతృత్వ పాలనలోకి తీసుకోవడానికి బిజెపి నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. విదేశాల్లో పేరుకుపోయిన నల్లధనాన్ని తీసుకువస్తామన్న హామీని విస్మరించారన్నారు. దేశంలో అడ్డగోలుగా నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పరీక్ష పేపర్ల లీకేజీలు జరిగి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను ఉచితాలు అంటున్నారని, దేశంలో పేదలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలని పేర్కొన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పిందని, పరిపాలనలో జవాబుదారితనం తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి పెరిగిపోయిందన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అనుచరులకు ఇస్తున్నారని ఆరోపించారు. ఆసరా పెన్షన్లను ఇచ్చిన హామీ మేరకు పెంచాలని డిమాండ్ చేశారు.




