Maheswaram: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ఒక రోజు ట్రాఫిక్ విధులే శిక్షగా కోర్టు ఆదేశం!

Maheswaram: మహేశ్వరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి కోర్టు వినూత్న శిక్ష విధించింది.

K Sai, Maheswaram
Published on: 1 Aug 2026 10:35 AM IST
Maheswaram
X

Maheswaram: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ఒక రోజు ట్రాఫిక్ విధులే శిక్షగా కోర్టు ఆదేశం!

Maheswaram: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన రాట్లావత్ మల్లేష్‌ పై మహేశ్వరం ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసారు. అంతరంఇబ్రహీంపట్నంలోని న్యాయ స్థానం మేజిస్ట్రేట్ సుజాత ముందు అజరుపర్చగా అతనిని విచారించిన అనంతరం రాట్లావత్ మల్లేష్‌కు 6 వేల రూపాయలు జరిమానా విధించడంతో పాటు ఒక రోజు పాటు మహేశ్వరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ విధులు నిర్వహించాలని ఆదేశించించారు.

ఈ సందర్భంగా మహేశ్వరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

K Sai, Maheswaram

K Sai, Maheswaram

Next Story