Vikarabad: తాండూరులో సమస్యల నిలయంగా ప్రభుత్వ పాఠశాలలు కౌన్సిలర్ జావిద్!
Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ అధికారుల తీరును తప్పుబట్టారు.
Vikarabad: తాండూరులో సమస్యల నిలయంగా ప్రభుత్వ పాఠశాలలు కౌన్సిలర్ జావిద్!
Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరు ఇందిరమ్మ, రాజీవ్ కాలనీల్లో ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను అధికారులు, రాజకీయ నాయకులు తీర్చకపోవడం శోచనీయమని 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ అన్నారు. సోమవారం 8వ వార్డు రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ లోని ప్రభుత్వ పాఠశాలను వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ జావీద్ మాట్లాడుతూ....
అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కాలనీల్లోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిపై దృష్టి సారించడం లేదన్నారు. ప్రహరీ గోడ శిధిలమై అసాంఘిక కార్యక్రమాలకు నిలయమౌతుందన్న విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. పాఠశాలల్లో ఉన్న రెండు మూడు తరగతి గదుల్లో ఆరు, ఏడు తరగతుల వరకు తరగతులను నిర్వహిస్తున్నారన్నారు.
ఇంగ్లీష్, ఉర్దూ మీడియం విద్యార్థులకు ఒకేసారి ఒకే దగ్గర బోధిస్తే వారికి ఏమీ అర్థం అవుతుందన్నారు. ఒక పర్మినెంట్ టీచర్ మినహా మిగిలిన టీచర్లను టెంపర్వరీగా తీసుకోవడం జరిగిందన్నారు. పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను పాఠశాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వ పాలకులు, అధికారులు పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.




