Tandur: మాణిక్ నగర్ కాలనీలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు!
Tandur: తాండూరు పట్టణంలోని మాణిక్ నగర్ కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
Tandur: మాణిక్ నగర్ కాలనీలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు!
Tandur: కార్డెన్ సెర్చ్ అనేది నేరాలను అరికట్టడానికి, శాంతిభద్రతలను కాపాడడానికి పోలీస్ శాఖ నిర్వహించే ఆకస్మిక తనిఖీలనీ డి.ఎస్.పి నర్సింగ్ యాదయ్య అన్నారు . శనివారం తాండూరు పట్టణంలోని మాణిక్ నగర్ కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
అనంతరం డి.ఎస్.పి మాట్లాడుతూ...
ఇందులో భాగంగా ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని లేదా కాలనీని పూర్తిగా తమ అదుపులోకి తీసుకొని, ప్రతి ఇంటా సోదాలు చేసి, సరైన పత్రాలు లేని వాహనాలు మరియు అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తామన్నారు.
జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల అణచివేత, సరైన నంబర్ ప్లేట్లు, ధ్రువపత్రాలు లేని వాహనాల గుర్తింపు మరియు సీజింగ్ ఇలాంటి కార్యక్రమాలు ఈ కార్డెన్ సెర్చ్ లో భాగమన్నారు. ప్రజలలో భద్రతా భావన్ని పెంపొందించడం, అనుమానితులను విచారించడం ఇందులో భాగమన్నారు.
68 టూవీలర్లు, మూడు ఆటోలు ,
54 మద్యం బాటిల్లు ,
ఒక గుట్కా ప్యాకెట్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. గంజాయి, మట్కా, అక్రమ మద్యం, పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా వంటి చెడ్డ వ్యతిరేక కార్యకలాపాలను సహించబోమని హెచ్చరించారు. కాలనీ ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.




