Hayathnagar: తాతా మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన చావుడప్పు ర్యాలీ!
Hayathnagar: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలకు నిరసనగా కుంట్లూర్ డివిజన్‌లో కాంగ్రెస్ చావుడప్పు ర్యాలీ. కాంగ్రెస్ నేతల అరెస్ట్.
Hayathnagar: తాతా మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన చావుడప్పు ర్యాలీ!
Hayathnagar: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంట్లూర్ డివిజన్‌లో చావు డప్పుతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు గ్యారాల శ్రీనివాస్ మాట్లాడుతూ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిరసన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పోలీసుల చొక్కాలు పట్టుకుని దాడికి దిగడం సరైన చర్య కాదని ఆయన మండిపడ్డారు.
బీఆర్ఎస్ నాయకులకు దళితుల పట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అక్కసుతో దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలు, స్కామ్‌లను వెలికితీసి ప్రజల ముందుకు తీసుకువస్తామని గ్యారాల శ్రీనివాస్ హెచ్చరించారు.




