Bachupally: బాచుపల్లిలో కాంగ్రెస్ నేత వీరారెడ్డిపై హత్యాయత్నం!
Bachupally: బాచుపల్లి జిపిఆర్ లేఅవుట్‌లో కాంగ్రెస్ నేత వీరారెడ్డి కారును దుండగులు పెట్రోల్ పోసి దహనం చేశారు. హత్యాయత్నంగా భావిస్తున్న ఘటనపై పోలీసుల దర్యాప్తు.
Bachupally: బాచుపల్లిలో కాంగ్రెస్ నేత వీరారెడ్డిపై హత్యాయత్నం!
Bachupally: పోలీస్‌స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నేత వీరారెడ్డిపై హత్యాయత్నం కలకలం రేపింది. జి.పి.ఆర్. లేఅవుట్ వద్ద ఉన్న ఆయన కార్యాలయం సమీపంలో నిలిపిన కారుకు గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు.
మంటలను గమనించిన వీరారెడ్డి గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది...వీరారెడ్డిని లక్ష్యంగా చేసుకునే పక్కా పథకంతోనే కారుకు నిప్పంటించారా...లేక వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివాదమే ఘటనకు కారణమా..అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు ముందు, అనంతరం అక్కడి పరిసరాల్లో సంచరించిన వ్యక్తుల వివరాలను సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు.వీరారెడ్డి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలను సేకరించి, వాటి ఆధారంగా దుండగులను నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు...




