Amanagal: ఆకస్మాత్తుగా మృతి చెందిన కుటుంబాలకు పరామర్శ.. సుంకిరెడ్డి!

Amanagal: మాడ్గుల మండలాల్లో ఆకస్మాత్తుగా మృతి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, స్థానికుల కుటుంబాలను ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పరామర్శించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 3 Aug 2026 10:01 PM IST
Amanagal
X

Amanagal: ఆకస్మాత్తుగా మృతి చెందిన కుటుంబాలకు పరామర్శ.. సుంకిరెడ్డి!

ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మాడుగుల మండలంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆకస్మిక మరణం చెందిన వారి కుటుంబాలను ఈ రోజు పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆమనగల్ మున్సిపాలిటీలోని జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఖాదర్ తల్లి మరణవార్త తెలుసుకుని నివాసానికి వెళ్లి పార్థివ దేహానికీ ఘనంగా నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అనంతరం మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జెల్ల యాదగిరి మరణవార్త తెలుసుకుని వారి నివాసానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెప్పారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో ఆయన తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story