Medchal: కాంగ్రెస్ నేత రాఘవేందర్ గౌడ్ జన్మదినం.. సేవా మార్గంలో వేడుకలు!
Medchal: మేడ్చల్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఆర్.ఆర్. ఫౌండేషన్ అధినేత రామన్నగారి రాఘవేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Medchal: కాంగ్రెస్ నేత రాఘవేందర్ గౌడ్ జన్మదినం.. సేవా మార్గంలో వేడుకలు!
మేడ్చల్: ఆర్.ఆర్. ఫౌండేషన్ అధినేత మరియు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ 297 డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ రామన్నగారి రాఘవేందర్ గౌడ్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.రాఘవేందర్ గౌడ్ పుట్టినరోజును పురస్కరించుకుని మేడ్చల్ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఇందులో భాగంగా మేడ్చల్ జూనియర్ కళాశాల, మేడ్చల్ ప్రభుత్వ పాఠశాల, మరియు రైలాపూర్,గిర్మాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు,నోట్ బుక్స్ పంపిణీ చేశారు. పేద విద్యార్థుల చదువుకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
ఉపాధ్యాయులకు ఘన సన్మానం..
ఇదే వేదికపై సెప్టెంబర్ 5 ‘ఉపాధ్యాయ దినోత్సవాన్ని’ పురస్కరించుకుని విద్యాబుద్ధులు నేర్పుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను రాఘవేందర్ గౌడ్ అభిమానులు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న గురువులను గౌరవించుకోవడం మన బాధ్యతని ఈ సందర్భంగా కొనియాడారు.
ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడిగా,అన్నా అని పిలిస్తే ‘నేను ఉన్నా’ అంటూ ముందుండే రాఘవేందర్ గౌడ్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు,స్థానిక ప్రజలు మరియు పార్టీ కార్యకర్తలు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఆర్. ఫౌండేషన్ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




