Vikarabad: దళితుల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు: చైతన్య కిరణ్!
Vikarabad: పేరుతో కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోందని, కోర్టు తీర్పును వక్రీకరిస్తూ లబ్ధి పొందాలని చూస్తోందని వికారాబాద్ బీఆర్ఎస్ నేత చైతన్య కిరణ్ మండిపడ్డారు.
Vikarabad: దళితుల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు: చైతన్య కిరణ్!
Vikarabad: మొన్న జరిగిన సంఘటనలో స్పీకర్ పేరుతో దళితుడని అభ్యంతరకర పదజాలంతో వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయని, అయితే అందుకు సంబంధించిన ఆధారాలను పరిశీలించిన అనంతరం కోర్టు ఆ వాదనలను తిరస్కరించిందని తెలిపారు.
న్యాయస్థానం స్పష్టంగా చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అదే అంశాన్ని కొనసాగిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అత్యధిక కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, మరి ఆ సమయంలో దళితుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దళితులు వచ్చారని పసుపు నీళ్లతో శుద్ధి చేశారంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. ప్రజలకు బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు వచ్చినందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేశారని తెలిపారు.
ఇందిరమ్మ రాజ్యం, సోనియా గాంధీ రాజ్యం, రాజన్న రాజ్యం అంటూ ఇప్పుడు ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోందని, కానీ దళితులకు గానీ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గానీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు.
ప్రశ్నించే గొంతును నొక్కడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని, బీఆర్ఎస్ పార్టీపై అబద్ధపు ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. దళితులకు రూ.12 లక్షల ఆర్థిక సహాయం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.
అలాగే ఎస్సీ సబ్‌ప్లాన్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని గొప్పలు చెప్పుకుంటున్నారని, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఎస్సీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి ఎస్సీలను అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సరే మరి అధికారంలో ఉన్న సమయంలో ఎన్ని కోట్ల నిధులు కేటాయించారో
ఆ నిధులను ఎక్కడ అభివృద్ధి పనులకు వినియోగించారు శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు టిఆర్ఎస్ పార్టీ కోరేది కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావడం కాదని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి అభివృద్ధి చేయాలని నిరసనలు ధర్నాలు చేస్తూ కోరుతున్నామని అన్నారు
ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా బిఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని దీనిని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలని తెలిపారు రాజకీయ లబ్ధి కోసమే బిఆర్ఎస్ పార్టీ పై లేని పోనీ నిందలు వేస్తూ అణచివేయాలనే ప్రయత్నాలు చేయవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖబర్దార్ అని హెచ్చరించారు




