Boduppal: బోడుప్పల్ కమాన్ వద్ద సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం!

Boduppal: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బోడుప్పల్‌లో DCC అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, అజయ్ యాదవ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

KARUNAKAR, UPPAL
Published on: 3 Sept 2026 4:29 PM IST
Boduppal
X

Boduppal: బోడుప్పల్ కమాన్ వద్ద సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం!

Boduppal: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌ సర్కిల్‌ పరిధిలో కాంగ్రెస్‌ నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌యాదవ్‌, బోడుప్పల్‌ మాజీ మేయర్‌ తోటకూర అజయ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ బోడుప్పల్‌ కమాన్‌ వద్ద ముగిసింది. అక్కడ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి వజ్రేష్‌యాదవ్‌, అజయ్‌యాదవ్‌ పాలాభిషేకం చేశారు.

అనంతరం ప్రభుత్వ విజయాలను వివరిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వజ్రేష్‌యాదవ్‌ మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ పాలనలో కుటుంబ, గడీల పాలన సాగిందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ప్రాధాన్యమిస్తూ ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నాయకులు బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చేస్తున్న విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గత పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు అండగా నిలిచారని, రానున్న గ్రేటర్‌ హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షులు బొమ్మ కళ్యాణ్‌, తుంగతుర్తి రవి, బండి శ్రీరాములు, పోగుల దిలీప్‌రెడ్డి, పోగుల నరసింహ రెడ్డి, కొత్త కిషోర్ గౌడ్ తో పాటు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story