Tarnaka: తార్నాకలో కాంగ్రెస్ 1000 రోజుల పాలన సంబరాలు!

Tarnaka: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా సీతాఫల్‌మండి మాణిక్యేశ్వరి నగర్‌లో గండికోట కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు, బైక్ ర్యాలీ నిర్వహించారు.

HARISH, TARNAKA
Published on: 6 Sept 2026 9:22 AM IST
Tarnaka
X

Tarnaka: తార్నాకలో కాంగ్రెస్ 1000 రోజుల పాలన సంబరాలు!

Tarnaka: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా సీతాఫల్‌మండి డివిజన్‌ మాణిక్యేశ్వరి నగర్‌లో శనివారం కాంగ్రెస్‌ నాయకులు సంబరాలు నిర్వహించారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదం సంతోష్‌ ఆదేశాల మేరకు డీసీసీ ప్రధాన కార్యదర్శి, వడ్డే ఓబన్న ఉత్సవ కమిటీ సభ్యుడు గండికోట కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాణిక్యేశ్వరి నగర్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి గండికోట కుమార్‌ పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం కార్యకర్తలతో కలిసి టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళా ప్రయాణికులకు, స్థానిక చిరు వ్యాపారులకు స్వీట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గండికోట కుమార్‌ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మాణిక్యేశ్వరి నగర్‌ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని గండికోట కుమార్‌ అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు వేముల శ్రీనివాస్‌, కొడుదల నరసింహ, గండికోట వెంకటేష్‌, ఆలకుంట వెంకటేష్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story